చిల్లర్ అనే పదంలో 'చిల్' ఉంది.. శశిథరూర్‌కి చురకలంటించిన 'మిస్ వరల్డ్' చిల్లర్!
- మన చిల్లర్ ప్రపంచ సుందరి అయ్యింది అంటూ శశిథరూర్ ట్వీట్
- ప్రపంచాన్ని గెలిచిన ఓ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలకు కలత చెందదు
- ‘చిల్లర్’పై ఈ చర్చ ఓ చిన్న మార్పు మాత్రమే- మానుషీ చిల్లర్
శశిథరూర్ వ్యాఖ్యపై మానుషీ చిల్లర్ స్పందించింది. ప్రపంచాన్ని గెలిచిన ఓ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలకు కలత చెందదని ఆమె పేర్కొంది. ‘చిల్లర్’పై ఈ చర్చ ఓ చిన్న మార్పు మాత్రమే అని కౌంటర్ ఇచ్చింది. చిల్లర్ అనే పదంలో 'చిల్' ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని చురకలంటించింది. కాగా, తాను చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగుతుండడంతో శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. మానుషి అందానికి, తెలివితేటలకి, ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్ అని మరో ట్వీట్ చేశారు. ఆమెను కించపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తాను ఆ ట్వీట్‌ను సరదాగా చేసినట్లు పేర్కొన్నారు.