భారత్ లో పాగా వేసేందుకు ఐసిస్ యత్నం.. భారీగా నిధుల సరఫరా.. ఇంటెలిజెన్స్ అప్రమత్తం!
Add ap7am to your home Screen

భారత్ లో పాగా వేసేందుకు ఐసిస్ యత్నం.. భారీగా నిధుల సరఫరా.. ఇంటెలిజెన్స్ అప్రమత్తం!

  • గల్ఫ్ దేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు
  • భారీ విధ్వంసానికి కుట్ర
  • ప్రణాళికలను భగ్నం చేసిన కేరళ పోలీసులు
ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఉగ్ర సంస్థ ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది. గల్ఫ్ దేశాల్లో క్రమంగా ప్రాబల్యం తగ్గిపోవడంతో... ఇప్పుడు మన దేశంపై కన్నేసింది. ముఖ్యంగా కేరళను టార్గెట్ చేసింది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోంది. తద్వారా భారత్ లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో డబ్బును ఇక్కడకు తరలించడానికి హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే ఈ ప్రణాళికలను కేరళ పోలీసులు భగ్నం చేశారు. భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. దాడులు జరిపి ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు డబ్బు పంపిణీ అవుతోంది.
isis
terrorism
isis in kerala

More Telugu News