పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ దుమ్మురేపేశాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ దుమ్మురేపేశాడట!

  • 'ఖాకి' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు కార్తీ
  • ఆయన నటన అదుర్స్ అంటూ టాక్ 
  • భావోద్వేగాలు బాగా పండించాడంటూ ప్రశంసలు 
  • హిట్ ఖాయమనే అభిప్రాయాలు
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయకుడిగా కార్తీకి మంచి క్రేజ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు ప్రేక్షకులముందుకు వస్తుంటాయి. అలా తమిళంలో ఈ రోజున 'ధీరన్ అధిగారమ్ ఒండ్రు' విడుదల కాగా, తెలుగులో 'ఖాకి' పేరుతో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ధీరజ్ అనే పేరుతో నిజాయితీ  కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ నటించాడు.

 ఈ సినిమా చూసిన ప్రేక్షకులు .. ఈ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ను ప్రత్యక్షంగా చూసిన ఫీల్ ను కలిగించాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలతో పాటు .. భావోద్వేగాలతో కూడిన సీన్స్ లో ఆయన జీవించాడని అంటున్నారు. ఇక రకుల్ తో రొమాంటిక్ సీన్స్ లోను అదరగొట్టేశాడని చెబుతున్నారు. కార్తీ కెరియర్ లో ఈ సినిమాకి తప్పకుండా ప్రత్యేకమైన స్థానం లభిస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా కార్తీ ఎదురుచూస్తోన్న సక్సెస్, ఈ సినిమాతో ఆయనకి దొరకడం ఖాయమని చెప్పుకుంటున్నారు.          
karthi
rakul

More Telugu News