ఇంత ప్రేమకు నేను అర్హుడినా.. కళ్లు చెమర్చాయి: శివబాలాజీ

  • 17న రిలీజ్ కానున్న శివబాలాజీ సినిమా
  • మద్దతు పలికిన పవన్ అభిమానులు
  • భావోద్వేగానికి గురైన శివబాలాజీ
బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ నటించి, సొంతంగా నిర్మిచిన సినిమా 'స్నేహమేరా జీవితం'. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నారు. శివబాలాజీని పవన్ కల్యాణ్ తమ్ముడిలా భావిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివబాలాజీ సినిమా హిట్ కావాలంటూ సినిమా పోస్టర్ కు పవన్ అభిమానులు హారతులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న శివబాలాజీ తన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వీడియోను జత చేస్తూ, కామెంట్ పోస్ట్ చేశాడు. ఇంత ప్రేమకు తాను అర్హుడినా అనిపించిందని... కళ్లు చెమర్చాయని తెలిపాడు. ఎన్నో జన్మల పుణ్యఫలమే మీ ఈ ప్రేమ అని చెప్పాడు. ఇంత ప్రేమను మీకు ఎలా తిరిగి ఇవ్వగలనో అర్థం కావడం లేదని... మీకు సదా రుణపడి ఉంటానని తెలిపాడు. ఇంతగా అభిమానిస్తున్న మీ అందరికీ వేల కోట్ల వందనాలు అంటూ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
sivabalaji
tollywood
Pawan Kalyan
snehamera jeevitham movie

More Telugu News