pawan kalyan: పవన్ కల్యాణ్ కు రూ. 40 కోట్ల ఆఫర్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న పవర్ స్టార్

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలింనగర్ లో ప్రస్తుతం ఓ టాక్ వినిపిస్తోంది.

పవన్ తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ చాలా కాలంగా భావిస్తోందట. దీని కోసం పవన్ కు రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారట. తమ సినిమాకు పవన్ 'ఓకే' చెబితే... ఆయన రెమ్యునరేషన్ తో కలిపి రూ. 80 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాదు, ఎన్నికల ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో, ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారట. ఏం చేయాలన్న విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఒకవేళ పవన్ ఓకే చెబితే... దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా పవన్ అవతరిస్తారు.
Go Back to Shorts
pawan kalyan
tollywood
janasena
trivikram sreenivas

More Telugu News