'నిన్నుకోరి' డైరెక్టర్ తో మెగా హీరో మూవీ!
- వెంకీ అట్లూరితో వరుణ్ తేజ్ తాజా చిత్రం
- తదుపరి సినిమా శివ నిర్వాణతో
- 'నిన్నుకోరి'తో హిట్ కొట్టిన దర్శకుడు
- వరుణ్ నెక్స్ట్ మూవీ నిర్మాతగా డీవీవీ దానయ్య
నాని - నివేదా థామస్ - ఆది పినిశెట్టి కాంబినేషన్లో ఈ మధ్య వచ్చిన 'నిన్నుకోరి' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి సినిమాను అందించిన శివ నిర్వాణ .. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను సిద్ధం చేశాడట. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో వున్నారు.