Uttar Pradesh: తొలి అటెంప్ట్ లో సివిల్ జడ్జి పరీక్ష ర్యాంకర్ కు ఎదురైన ప్రశ్న ఇదే...!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల వెలువడ్డ యూపీపీఎస్సీ, పీసీఎస్ (జే) పరీక్ష ఫలితాలలో అలహాబాద్ లోని గోవింద్ పూర్‌ కు చెందిన ఆకృతి గౌతమ్ మొదటి ప్రయత్నంలోనే 54వ ర్యాంకు సంపాదించింది. దీంతో మీడియా ఆమెను తొలి ప్రయత్నంలోని సివిల్ జడ్జి పరీక్షలో విజేతగా నిలవడంపై అభినందించింది.

ఈ సందర్భంగా ఇంటర్వూలో తాను ఎదుర్కొన్న ప్రశ్న, జవాబును ఆమె వివరించింది. ఇంటర్వ్యూ హాల్ లో అడుగుపెట్టిన ఆకృతితో బోర్డు మెంబర్లు... ‘ఒకవేళ మీ భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, చాలా దూరంలో పని చేస్తున్నారనుకుందామనుకోండి.. నేను ఉద్యోగం చేస్తాను... నువ్వు మానెయ్ అని అడిగితే ఏం చేస్తారు?' అని ప్రశ్నించారు.

దానికి ఆమె సమాధానం ఇస్తూ... ‘నాకు కుటుంబం కూడా ముఖ్యమే. కుటుంబంతో ఉండడాన్ని నేను బాగా ఇష్టపడతాను. అయితే నా భర్త ఉద్యోగం మానేయమని అడిగితే ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాను. మొదట్లో అతను ఒప్పుకోకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తాను. అతన్ని ఒప్పంచగలననే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పింది. దీనికి ముగ్దులైన ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు ఆమెను ఉత్తీర్ణురాలిని చేశారని తెలిపింది. 
Go Back to Shorts
Uttar Pradesh
allhabad
akruti
uppsc
pcs(j)

More Telugu News