నాగచైతన్య: శ్రీమతి కోసం వంట చేసిన నాగచైతన్య!
సినీనటులు నాగచైతన్య, సమంత గత నెల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు పలుసార్లు తన కోసం వంట చేస్తుండగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో నాగచైతన్య పోటోలను పోస్ట్ చేసి అలరించింది. అయితే, పెళ్లయిన తరువాత కూడా చైతూ తన శ్రీమతికి వంట చేసి పెడుతున్నాడు.
తమ పెళ్లి జరిగి నెలరోజులు గడుస్తోన్న నేపథ్యంలో నాగ చైతన్య.. సమంత కోసం స్వయంగా మరోసారి ప్రత్యేక వంట చేశాడు. తనకు తన భర్త సర్‌ప్రైజ్ ఇచ్చాడని, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తాను ప్రపంచంలోనే అతి ఉత్తమ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఈ జీవితం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పింది.