మాకు ఎవరూ లేరనుకున్నాం .. అందరూ అండగా నిలిచారు!: జీవిత రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాకు ఎవరూ లేరనుకున్నాం .. అందరూ అండగా నిలిచారు!: జీవిత రాజశేఖర్

  •  'గరుడ వేగ' సక్సెస్ పట్ల జీవిత రాజశేఖర్ ఆనందం 
  • రానా .. కాజల్ .. తాప్సి .. లక్ష్మీ మంచు టీజర్ రిలీజ్ చేశారు
  • బాలకృష్ణ ముహూర్తం పెట్టిమరీ ట్రైలర్ లాంచ్ చేశారు 
  • అందరి సహకారంతోనే సక్సెస్ లభించింది
రాజశేఖర్ కథానాయకుడిగా వచ్చిన 'గరుడ వేగ' సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రోజు రోజుకి వసూళ్లు పుంజుకుంటూ ఉండటం ఈ సినిమా టీమ్ కి ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై జీవిత చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సినిమా సక్సెస్ కి కారకులైన వారికి థ్యాంక్స్ అనే ఒక మాట చెబితే సరిపోదని అన్నారు.

 ఒక్క ఫోన్ కాల్ చేసి .. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయమని అడగ్గానే రానా .. కాజల్ .. తాప్సి .. మంచు లక్ష్మీ అంగీకరించడం విశేషమని చెప్పారు. ఇక ట్రైలర్ లాంచ్ చేయడానికి రావలసిందిగా బాలకృష్ణ గారిని కోరితే, స్వయంగా ముహూర్తం పెట్టిమరీ ట్రైలర్ ను లాంచ్ చేశారని అన్నారు. ఈ సినిమా విడుదల తరువాత చిరంజీవి .. మహేశ్ బాబు ఫోన్ చేసి రాజశేఖర్ కి అభినందనలు తెలిపారని చెప్పారు. మాకెవరూ లేరనుకున్నామనీ, కానీ అందరూ తమకి అండగా నిలిచారంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.  
jeevita rajasekhar

More Telugu News