అందుకే నా సినిమాలు చూడొద్దని నా వైఫ్ కి చెబుతుంటాను : హీరో కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే నా సినిమాలు చూడొద్దని నా వైఫ్ కి చెబుతుంటాను : హీరో కార్తీ

  • లవ్ సీన్స్ లో ఇన్వాల్వ్ కావల్సిందే
  • నా భార్య క్వశ్చన్ చేస్తుంది 
  • గొడవ పడటమూ మామూలే 
  • నేను అర్థం చేసుకోగలను        
తాను చేసిన సినిమాలు .. వాటిలో కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు తన భార్య ఎలా ఫీలవుతుందనే విషయాన్ని గురించి, 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో కార్తీ ప్రస్తావించారు. " నేను చేసిన లవ్ సీన్స్ చూసినప్పుడు .. లవ్ సీన్స్ లో టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కష్టమా?" అని నా భార్య అడుగుతుంటుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో నేను కొంచెం ఎక్స్ ట్రా .. అందువలన ఆమె కొంచెం జెలసీ ఫీల్ కావడం సహజం" అన్నారు.

"ప్రేమ .. పెళ్లి వంటి సీన్స్ లో పూర్తిగా ఇన్వాల్వ్ కాకపోతే .. ఆ సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. అందువలన ఆడియన్స్ కు ఆ ఫీల్ కలిగేలా నటించవలసి వస్తూ ఉంటుంది. ఈ విషయాలను అర్థమయ్యేలా నేను చెప్పినా .. ఒక వైఫ్ గా ఆమెకది కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. ఆమె స్థానంలో నేనున్నా అలాగే ఫీలవుతాను. ఈ విషయంలో తనకీ నాకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దాంతో నా సినిమాలు చూడొద్దనే నేను ఆమెకి చెబుతూ వుంటాను" అంటూ నవ్వేశారు.       
karthi

More Telugu News