కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు నన్ను పట్టించుకోలేదు .. హీరోనయ్యాక వెంటపడ్డారు : కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు నన్ను పట్టించుకోలేదు .. హీరోనయ్యాక వెంటపడ్డారు : కార్తీ

  • హిట్ సినిమాతో పాటే పుకార్లు వస్తాయి 
  • నాకూ . . తమన్నాకి సంబంధించిన వార్తలు అలాంటివే
  • నేను సీరియస్ గా తీసుకోలేదు 
  • అదో నైస్ ఫీలింగ్ .. అంతే  
హీరో కార్తీ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన అనుభవాలను పంచుకున్నారు. ఒక ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ "ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ నాకు ప్రపోజ్ చేయలేదు" అన్నారు. తమన్నాతో లింక్ చేస్తూ జరుగుతోన్న ప్రచారాన్ని గురించి ప్రస్తావిస్తే, "ఒక హీరో .. ఒక హీరోయిన్ తో చేసిన సినిమా సక్సెస్ అయితే ఇలాంటి ప్రచారాలు జరగడం కామన్" అని చెప్పారు.

 "స్పైసీ న్యూస్ కోసం కొంతమంది ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు .. ఒక రకంగా ఇలాంటి వార్తలను ఎంజాయ్ చేస్తాను" అన్నారు. "కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూడలేదు. ఆ తరువాత హీరోగా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు .. నన్ను పెళ్లి చేసుకో .. నన్ను పెళ్లి చేసుకో .. అని వెంటపడేవారు. ఆ మాటలను నేను సీరియస్ గా తీసుకోలేదు గానీ .. ఆ ఏజ్ లో నాకు అదొక నైస్ ఫీలింగ్ అనిపించింది" అని చెప్పుకొచ్చారు.     
karthi

More Telugu News