ntr: 'టబు' విషయంలో ఆలోచనలోపడిన త్రివిక్రమ్ .. కారణం ఎన్టీఆర్?

షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో న్యూలుక్ తో కనిపించడానికి ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నాడు. త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటాడు. 'అత్తారింటికి దారేది'లో నదియాను .. 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఖష్బూను తీసుకున్నాడు.

అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన 'టబు'ను ఎంపిక చేసే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పాత్ర పరంగా 'టబు' సెట్ కాదనే అభిప్రాయాన్ని ఎన్టీఆర్ వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ పూర్తి నమ్మకం ఉంచాడనీ, కనుక ఇలాంటి విషయాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశమే లేదని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో 'టబు'ను ఓకే చేస్తారా .. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.       
Go Back to Shorts
ntr
trivikram

More Telugu News