ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్ అండ్ కో.,
- కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న మాజీ టీడీపీ నేతలు
- కుంతియాతో భేటీ
- కాసేపట్లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
మరోవైపు, పార్టీలోకి వీరి రాకను కొందరు నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఎంతోకాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని కాదని... కొత్తవాళ్లను పార్టీలోకి చేర్చుకోవడం భావ్యం కాదని వారు అన్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ ను తిట్టిన వారిని... పార్టీలోకి చేర్చుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలసి, తమ అభిప్రాయాలను ఆయనకు వెల్లడిస్తామని చెప్పారు.