వెయిట్ చేయడానికి సిద్ధపడిన శ్రీను వైట్ల!
- మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందుతోన్న రెండు సినిమాలు
- నెక్స్ట్ మూవీ శ్రీను వైట్ల - రవితేజలతో
- సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యం
అయితే ప్రస్తుతం వాళ్లు చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం' సినిమా చేస్తున్నారు. అలాగే చందూ మొండేటి - నాగచైతన్య కాంబినేషన్లోను ఓ సినిమాను మొదలెట్టారు. ఆ సినిమాలు పూర్తయిన తరువాతనే రవితేజ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతామనీ, అప్పటివరకూ ఆగకపోతే వేరే నిర్మాతను చూసుకోమని శ్రీను వైట్లకి చెప్పారట. మైత్రీ మూవీస్ బ్యానర్లోనే చేయాలనుకున్న శ్రీను వైట్ల, అప్పటివరకూ వెయిట్ చేయడానికి ఓకే అన్నాడని సమాచారం. అంటే .. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందన్న మాట.