మధుమితను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు శివబాలాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధుమితను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు శివబాలాజీ

  • మొబైల్ ఫోన్ కు అసభ్య సందేశాలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శివబాలాజీ
  • ట్రేస్ చేసే పనిలో పడ్డ సైబర్ క్రైమ్ విభాగం
తన భార్య, నటి మధుమితను అసభ్య పదజాలం వాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ నటుడు శివబాలాజీ హైదరాబాదు, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గత కొంతకాలంగా మధుమిత మొబైల్ ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ లు వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ మెసేజ్ లు చెప్పుకోలేనంత అసభ్యంగా ఉంటున్నాయని పేర్కొంటూ, సైబరాబాద్ పోలీస్ కార్యాలయంలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సదరు మెసేజ్ లు వచ్చిన నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. కాగా, మధుమిత 'పుట్టింటికి రా చెల్లి' వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన సంగతి తెలిసిందే.
madhumita
siva balaji
cyberabad

More Telugu News