revanth reddy: టీడీపీకి రేవంత్ షాక్...ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీకి రేవంత్ రెడ్డి ఊహించినట్టే షాకిచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేటి ఉదయం అమరావతికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబు విదేశీ పర్యటన గురించి మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే సమావేశమందిరాన్ని వీడి వెళ్లిపోయారు. పార్టీలో పరిణామాలు తనను చాలా ఇబ్బందిపెట్టాయని ఆరోపిస్తూ ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

పార్టీపైనా, చంద్రబాబుపైనా తనకు చాలా గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు తనకు తండ్రిలాంటి వారని ఆయన చెప్పారు. ఓపక్క కేసీఆర్ పై తాను పోరాడుతుంటే, పార్టీ నేతలే ఆయనతో అంటకాగడం తనను ఇబ్బంది పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. తన భవిష్యత్ ప్రణాళికపై కొడంగల్ లో కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పారు. కాగా, గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి పార్టీ మారనున్నారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
revanth reddy
Telugudesam
amaravathi

More Telugu News