ధోని కుమార్తె పాటకు ఫిదా అయిన కేరళ ఆలయ నిర్వాహకులు... ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం
- మలయాళం భక్తి పాట పాడిన జీవా
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన జీవా పాట
- కృష్ణుడి పండగకు రావాలని ఆహ్వానం
జీవా ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో మూడు రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేశారు. 1992లో వచ్చిన మలయాళ చిత్రం `అద్వైతం`లోని భక్తి పాటను జీవా ముద్దు ముద్దుగా ఆలపించడం ఈ వీడియోలో చూడొచ్చు. కేరళకు చెందిన తన అమ్మమ్మ షీలా ఈ పాటను నేర్పించినట్లు వీడియోతో పాటు పెట్టిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.