ఇరాన్ ను ఏకాకిని చేయాలంటూ గల్ఫ్ దేశాలకు పిలుపునిచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి
- ఇరాన్ ను దీటుగా ఎదుర్కోవాలని సౌదీ అరేబియా, ఇరాక్ లకు సూచన
- ఖతార్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచన
- మధ్యప్రాచ్యంలో ఇరాన్ తీరు వివాదాస్పదమన్న అమెరికా విదేశాంగ మంత్రి
ఖతార్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఇరుగుపొరుగు దేశాలకు సూచించారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తూర్పారబట్టారు. యూరోపియన్ దేశాలు ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్ తో సంబంధాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఇరాన్ మద్దతు గల షితే మిలీషియా తిరుగుబాటుదారులను ఆ దేశం నుంచి రప్పించి, ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని ఆయన సలహా ఇచ్చారు.