ఎన్టీఆర్ అదరగొట్టేస్తాడు .. బన్నీ ఇరగదీసేస్తాడు : కొరియోగ్రాఫర్ రాజు సుందరం
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ అదరగొట్టేస్తాడు .. బన్నీ ఇరగదీసేస్తాడు : కొరియోగ్రాఫర్ రాజు సుందరం

  • నృత్య దర్శకుడిగా రాజు సుందరానికి మంచి పేరు 
  • ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం 
  • టాలీవుడ్ లో బాగా డాన్సులు చేసే హీరోల గురించిన ప్రస్తావన 
తెలుగు .. తమిళ భాషల్లో నృత్య దర్శకుడిగా రాజు సుందరానికి మంచి పేరుంది. సుదీర్ఘమైన కెరియర్లో ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా వ్యవహరించిన ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఈ రెండు భాషల్లోను ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేశారు. కనుక డాన్సుల విషయంలో ఆయా హీరోల పట్ల ఆయనకంటూ ఒక అభిప్రాయం తప్పకుండా ఉంటుంది.

 తెలుగులో డాన్సులు బాగా చేసే హీరోల విషయానికొస్తే, ఎక్కువగా ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ పేర్లు చెబుతుంటారు. ఈ ఇద్దరి హీరోల డాన్సుల గురించిన ప్రశ్నకి, రాజు సుందరం తన అనుభవాన్ని బట్టి సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ అదరగొడతాడని .. బన్నీ ఇరగదీస్తాడని ఆయన చెప్పారు.

ఒకసారి ఒక స్టెప్ ను కంపోజ్ చేస్తే .. ఆ స్టెప్ ను అల్లు అర్జున్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తాడని అన్నారు. ఇక ఎన్టీఆర్ కి ప్రాక్టీస్ .. రిహార్సల్స్ వంటివి ఏవీ ఉండవనీ .. ఒకసారి కంపోజ్ చేయగానే వెంటనే చేసేస్తాడని చెప్పారు. ఎవరి స్టైల్ వాళ్లకి ఉందనీ .. ఇద్దరూ డాన్స్ ను పెర్ఫెక్ట్ గా చేస్తారని చెప్పుకొచ్చారు.        
ntr
allu arjun

More Telugu News