రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధం?
- రేవంత్ పై వేటు వేయాలంటూ పొలిట్ బ్యూరో తీర్మానం
- అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ చంద్రబాబుకు లేఖ
- కఠిన చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు ఖండించలేదని... అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు తీర్మానించింది. చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసేలోగానే రేవంత్ పై వేటు పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.