Revanth reddy: రేవంత్ వస్తున్నాడంతే.. తేల్చి చెప్పిన కాంగ్రెస్ విప్ సంపత్‌రెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నాడని ఆ పార్టీ విప్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేవారు తప్పకుండా తమ పార్టీలోకి వచ్చి తీరుతారని అన్నారు. రాజకీయంగా పరిపక్వత ఉన్నవారు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అయితే, పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా గతంలో పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్టు చెప్పి మరీ రావాల్సి ఉంటుందని శాసనమండలి కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్ తేల్చి చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు. అయితే ఆ వెంటనే తన వ్యాఖ్యలను సవరించుకుంటూ గతంలో రాజీవ్‌ను ఉరి తీయాలని అన్న వారే ఆ తర్వాత పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి వస్తున్నట్టు తనకెవరూ చెప్పలేదని పేర్కొన్నారు.

కాగా, టీడీపీ నేత రేవంత్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న వార్తలతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా యువనేతలు జోష్ తో కనబడుతున్నారు. కొందరైతే రేవంత్ అప్పుడే కాంగ్రెస్‌లోకి వచ్చేసినట్టు బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకతో పార్టీలోని యువతకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
Go Back to Shorts
Revanth reddy
Telugudesam
congress
ponguleti

More Telugu News