రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఖాకీ' .. హిట్ ఖాయమంటోన్న కార్తీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఖాకీ' .. హిట్ ఖాయమంటోన్న కార్తీ

  • కార్తీ హీరోగా తెరకెక్కిన 'ఖాకీ' 
  • 'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు'కి అనువాదం 
  • కథానాయికగా రకుల్ 
  • నవంబర్ 17న విడుదల  
రజనీకాంత్ .. కమల్ .. విక్రమ్ .. సూర్య ..  కార్తీ వీళ్లంతా కూడా తమ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. కంటెంట్ ఉండాలేగానీ .. ఏ భాషా చిత్రాన్నయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే వుంటారు. అందువల్లనే కార్తీ కూడా తమిళంతో పాటు తెలుగులోను ఒకే రోజున తన సినిమాను విడుదల చేస్తున్నాడు.

 తమిళంలో ఆయన హీరోగా రూపొందిన 'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు' సినిమాకి .. తెలుగులో 'ఖాకీ' పేరును ఖరారు చేశారు. రెండు భాషల్లోను ఈ సినిమాను నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రకుల్ కనిపించనుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న కార్తీ, ఈ సినిమా తనకి హిట్ ను ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.  
karthi
rakul

More Telugu News