ఆ గంటన్నర పాటు రేవంత్ ఏమయ్యారు?... టీడీపీ నేతల్లో ఉదయిస్తున్న ప్రశ్న!
- ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి
- 11:30 గంటల తరువాత టీడీపీ భవన్ కు చేరిన రేవంత్ రెడ్డి
- సుమారు గంటన్నర పాటు ఆయన ఎక్కడికెళ్లారన్న అనుమానాలు
రేవంత్ రెడ్డి, అతని అనుచరులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గుడికి వెళ్లామని చెబుతుండగా, కాదు, కాంగ్రెస్ నేతలతో వీరు సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. గోల్కండ హోటల్ లో కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకించే నేతలతో రేవంత్ సమావేశమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తనతో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ నేతల జాబితాను కాంగ్రెస్ పెద్దలకు అందించినట్టు తెలుస్తోంది.