ముస్లిం యువకుడు - హిందూ యువతి... అన్ని వివాహాలనూ 'లవ్ జీహాద్' అనలేమన్న హైకోర్టు
- మత మార్పిడులపై కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు
- ప్రతి వివాహాన్నీ మత కోణంలో చూడరాదు
- కేరళలో పెరిగిన మాతాంతర వివాహాలు
అన్ని వివాహాలనూ లవ్ జీహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని, ప్రతి మతాంతర వివాహాన్నీ మత కోణంలో పరిశీలించరాదని జస్టిస్ వీ చిదంబరేష్, జస్టిస్ సతీష్ నినాన్ లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో తాను ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లి చేసుకోగా, తన తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న ఓ యువతి కోర్టును ఆశ్రయించగా, ఆ కేసుపైనా న్యాయస్థానం విచారణ జరిపింది. కేరళ రాష్ట్రంలోనే ఈ తరహా మత మార్పిడులు, ఘర్ వాపసీలు అధికంగా జరుగుతుండటం గమనార్హం. గత ఏడాది వ్యవధిలో ఇటువంటి 90 పెళ్లిళ్లు జరిగాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి.