naramalli padmaja: చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు: నారమల్లి పద్మజ

షార్ట్స్‌లో చూడండి
తమ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని... ఈ కారణంగానే పార్టీ ఫిరాయింపులతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైసీసీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మండిపడ్డారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, ప్యాకేజీలు ఇస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జగన్ పాదయాత్రను తక్కువ చేస్తూ, నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపిస్తే... ప్యాకేజీల కోసం పార్టీలు మారడం దారుణమని అన్నారు. ఓ వైపు విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Go Back to Shorts
naramalli padmaja
ysrcp
chandrababu
ap cm
ys jagan

More Telugu News