chaithu: చైతూ - శామ్ వెడ్డింగ్ విశేషాలు... వాళ్లిద్ద‌రి ఉంగ‌రాల ఆట వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
నాగ‌చైత‌న్య, స‌మంత‌ల పెళ్లి జ‌రిగి ప‌ది రోజులు పూర్తి కావొస్తోంది. అయిన‌ప్ప‌టికీ వారి పెళ్లికి సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుస్తున్నారు నెటిజ‌న్లు. నెటిజ‌న్ల ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగానే వారి పెళ్లికి సంబంధించి రోజుకొక కొత్త వీడియోనో, ఫొటోనో నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. పెళ్లికి వెళ్లిన వారు ఎవ‌రో ఒక‌రు, ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

 ఈ నేప‌థ్యంలో మ‌రో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హిందూ సంప్ర‌దాయంలో జ‌రిగిన‌ పెళ్లిలో వారిద్ద‌రూ ఉంగ‌రం ఆట ఆడుతున్న వీడియో చూడ‌టానికి చాలా ముచ్చ‌ట‌గా ఉంది. పురోహితుడు బిందెలో ఉంగ‌రం వేయ‌డం, దంప‌తులిద్ద‌రూ పోటీప‌డి ఉంగ‌రాన్ని తీయ‌డం ఈ వీడియోలో ఉంది. ఉంగ‌రం తీయ‌డంలో రెండు సార్లు స‌మంత నెగ్గ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

Go Back to Shorts
chaithu
samantha
akkineni
naga chaithanya
ring game
viral video

More Telugu News