70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారు: రేణుకపై జోగి రమేష్ విమర్శలు
- జగన్ వల్లే గెలిచానని చెప్పుకున్న రేణుక టీడీపీలో ఎందుకు చేరారు?
- చంద్రబాబు మరోసారి రాజకీయ వ్యభిచారానికి తెర తీశారు
- గతంలో టీఆర్ఎస్ ను విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పని చేస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రాజకీయ వ్యభిచారానికి తెర తీశారని జోగి రమేష్ అన్నారు. అందరూ తిడుతుంటే చంద్రబాబు మారారని అనుకున్నామని... కానీ, ఆయన మారలేదని చెప్పారు. సంతలో పశువులను కొనుగోలు చేస్తున్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ గతంలో టీఆర్ఎస్ ను విమర్శించిన చంద్రబాబు... ఇప్పుడు అదే పని చేస్తున్నారని మండిపడ్డారు.