సంచలన విషయం వెల్లడి.. తాలిబన్లకు నిధులు సమకూరుస్తున్న రష్యా
- నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తాలిబన్లకు నిధులు
- చమురు సరఫరా ద్వారా నిధులు సమకూరుస్తున్న రష్యా
- తొలిసారి బహిరంగంగా వెల్లడించిన తాలిబన్లు
రష్యా పంపిస్తున్న ఆయిల్ ట్యాంకర్లు ఉజ్బెకిస్థాన్ సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్థాన్ చేరుకుంటున్నాయి. 18 నెలల క్రితమే ఇది ప్రారంభమైందని తాలిబన్ సభ్యుడు తెలిపాడు. రష్యా తమకు సాయం అందిస్తున్నట్టు తాలిబన్లు బహిరంగంగా ప్రకటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో నాటో సభ్యదేశాలకు చెందిన 13వేల బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.