యంగ్ ఎన్టీఆర్ కి గుడి కట్టేందుకు సిద్ధమవుతోన్న ఫ్యాన్స్!
Add ap7am to your home Screen

యంగ్ ఎన్టీఆర్ కి గుడి కట్టేందుకు సిద్ధమవుతోన్న ఫ్యాన్స్!

  • కొత్తదనమున్న పాత్రలకి ప్రాధాన్యతనిస్తోన్న ఎన్టీఆర్
  • సొంతమవుతోన్న భారీ విజయాలు  
  • ఇతర రాష్ట్రాల్లోను పెరుగుతోన్న అభిమానులు    
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. టెంపర్ .. నాన్నకు ప్రేమతో .. జనతా గ్యారేజ్ .. జై లవ కుశ ..  ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి విజయాలను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోను ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. అక్కడ ఆయన సినిమాలకి వాళ్లు బ్ర్రహ్మరథం పడుతున్నారు.

అంతేకాదు ఎన్టీఆర్ పట్ల తమకి గల అభిమానాన్ని చాటుకోవడానికి గాను వాళ్లు ఆయనకి గుడి కట్టించాలని భావించినట్టు తెలుస్తోంది. తమిళనాట అందమైన హీరోయిన్స్ కి గుడి కట్టిన అభిమానులు వున్నారు. అలాంటిది కర్ణాటకలోని ఓ ప్రాంతం అభిమానులు ఎన్టీఆర్ కి గుడి కట్టాలని నిర్ణయించుకోవడం విశేషం. ఆ దిశగా వాళ్లు ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటిస్తారట.    
ntr

More Telugu News