roja: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో నటించడంపై రోజా స్పందన

షార్ట్స్‌లో చూడండి
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే రోజా నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రోజా స్పందించారు. లక్ష్మీపార్వతి పాత్రలో తాను నటిస్తున్నానని ప్రజలు అనుకోవడంలో తప్పు లేదని ఆమె అన్నారు. 150 సినిమాల్లో నటించిన తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని... ఆ అభిమానంతోనే వారు ఇలా ఊహించుకుంటుండవచ్చని తెలిపారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇంతవరకు తనను సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. అయితే, ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి జీవిత కథతో వస్తున్న సినిమాలో నటించే అవకాశం వస్తే,  తప్పకుండా ఆలోచిస్తానని తెలిపారు.
Go Back to Shorts
roja
ysrcp
ram gopal varma
tollywood
lakshmis ntr

More Telugu News