యూరప్ టూర్ కి బయల్దేరిన ఎన్టీఆర్ ఫ్యామిలీ!
Add ap7am to your home Screen

యూరప్ టూర్ కి బయల్దేరిన ఎన్టీఆర్ ఫ్యామిలీ!

  • ఎన్టీఆర్ కి హిట్ తెచ్చిపెట్టిన 'జై లవ కుశ'
  • హోస్ట్ గా 'బిగ్ బాస్' షోను నిలబెట్టిన ఎన్టీఆర్
  • రెండూ సక్సెస్ కావడంతో హ్యాపీ మూడ్ లో ఎన్టీఆర్ 
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే  
'జై లవ కుశ' సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోకూడదనే ఉద్దేశంతో, ఎంతమాత్రం గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ ఆ సినిమాను పూర్తి చేశాడు. అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. ఒక వైపున ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో వైపున 'బిగ్ బాస్' షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. దాంతో ఆయనకి తీరిక లేకుండా పోయింది.

 ఇక ఇప్పుడు ఇటు సినిమా .. అటు 'బిగ్ బాస్' షో సక్సెస్ కావడంతో ఆయన ఉత్సాహంతో వున్నాడు. ఇక త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి 3 నెలల సమయం వుంది. అందువలన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడానికి ఈ రోజున ఎన్టీఆర్ యూరప్ కి బయలుదేరుతున్నాడు. నెల రోజుల పాటు యూరప్ లోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ పర్యటించనున్నట్టు సమాచారం.   
ntr
pranathi

More Telugu News