ట్రైలర్ లేకుండానే విడుదల కానున్న విజయ్ `మెర్సల్`
- వెల్లడించిన దర్శకుడు అట్లీ
- ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలు, ఒక టీజర్
- దీపావళికి విడుదలకానున్న చిత్రం
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 3292 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. థియేటర్ల విషయంలో బాహుబలి, స్పైడర్ సినిమాల రికార్డును `మెర్సల్` బ్రేక్ చేసింది.
ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌లు కథానాయికలుగా నటించారు. మరోపక్క తమిళనాట వివాదాస్పదంగా మారిన ద్వంద్వ పన్నుల అంశం సినిమా విడుదల మీద ప్రభావం చూపించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.