అప్పుడు స్వీపరే... అవినీతితో ఇప్పుడు 50 కోట్లకు అధిపతి అయ్యాడు!
- స్వీపర్ గా 1985లో విధుల్లో చేరిన వెంకటనారాయణ రెడ్డి
- మూడు ప్రమోషన్లు, 50 కోట్ల రూపాయల అవినీతి
- ఏసీబీ దాడుల్లో అవినీతి బట్టబయలు
అనంతపురం, ధర్మవరం, పెనుకొండల్లో భవనాలు నిర్మించాడు. రైతులకు అప్పులిచ్చి వారి వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇతరత్రా స్థిరాస్తులు బలవంతంగా రాయించుకున్నాడు. అతని నివాసంతో పాటు అతని బంధువుల నివాసాలపై జరిపిన తనిఖీల్లో రాప్తాడు మండలానికి సంబంధించి ఓ రైతు భూమి, అనంతపురంలో మరో ఇల్లు, మరోచోట నివాస స్థలాన్ని ఇలాగే రాయించుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే భారీగా నగదు, నగలు, కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించినట్టు వారు వెల్లడించారు.