సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'త్రిపుర హెయిరాయిల్'కు లావణ్య ప్రచారం
  • హిందీ చిత్రంలో నటిస్తున్న అమల 
  • 'ఒక్కడు మిగిలాడు' విడుదలకు రెడీ 
  • కార్తీ, రకుల్ జంటగా మరో చిత్రం
*  తెలుగు సినిమాలలో బిజీగా వున్న లావణ్య త్రిపాఠి చేతికి కమర్షియల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'త్రిపుర' హెయిరాయిల్ ఉత్పత్తికి ఈ చిన్నది బ్రాండ్ అంబాసడార్ గా ఎంపికైంది. ఆయుర్వేద ఉత్పత్తులంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ కోవలోకే వచ్చే త్రిపుర హెయిరాయిల్ కి ప్రచారకర్తగా పనిచేస్తున్నందుకు ఆనందంగా వుందని చెప్పింది.
*  నాగార్జున భార్య, ప్రముఖ నటి అమల మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటోంది. ఈ విషయాన్ని నాగార్జున మీడియాకు తెలిపారు. సినిమా నిర్మాణంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను తెలుసుకోవడానికి ఆమె సినిమాలలో నటించడానికి నిర్ణయించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తోందని తెలిపారు.
*  మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం సీజీ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయం గురించి మనోజ్ చెబుతూ, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపాడు.
*  తాజాగా 'ఖాకి' సినిమాలో జంటగా నటించిన కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ మరో సినిమాలో కూడా జంటగా నటించనున్నారు. నూతన దర్శకుడు రజత్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. కాగా, 'ఖాకి' వచ్చే నెల 17న విడుదల కానుంది.     
Lavanya
karthi
rakul

More Telugu News