బెయిల్ మంజూరు.. నటి కిడ్నాప్ కేసులో దిలీప్‌కి ఊరటనిచ్చిన కేరళ హైకోర్టు
- ఐదోసారికి ఫలించిన బెయిల్ ప్రయత్నం
- 85 రోజులు జైల్లో ఉన్న నటుడు
- ఎట్టకేలకు బయటకు రానున్న హీరో
ఆయనకు బెయిల్ ఇస్తే.. కేసులో సాక్ష్యాలు తారుమారు కావడం, ఆధారాల ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించడంతో న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయలేదు. అయినప్పటికీ ఐదో సారి ఆయన బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. ఈసారి దిలీప్ అభ్యర్థనను అంగీకరిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 85 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత ఎట్టకేలకు దిలీప్ బెయిల్ మీద బయటకు రానున్నాడు. ఇటీవల దిలీప్ నటించిన 'రామ్‌లీల' సినిమా విడుదలైంది.