చంద్రబాబు కంటి కింద పొక్కులు... నొప్పిని భరిస్తూనే అధికారిక కార్యక్రమాల్లో తలమునకలు!
Add ap7am to your home Screen

చంద్రబాబు కంటి కింద పొక్కులు... నొప్పిని భరిస్తూనే అధికారిక కార్యక్రమాల్లో తలమునకలు!

  • పది రోజుల నుంచి సతమతమవుతున్న చంద్రబాబు
  • అయినా అధికారిక కార్యక్రమాల్లో బిజీ
  • పాలనకు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్న సీఎం
కంటి నొప్పి బాధను భరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికార కార్యక్రమాలకు ఎంత మాత్రం ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో రోజువారీ పనిలో నిమగ్నమై తన నిబద్ధతను చాటుకున్నారు. కన్ను మూసి తెరవాలంటే ఇబ్బందిగా ఉన్నా, తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు. చంద్రబాబు కుడికంటి కింద ఎర్రటి పొక్కు ఏర్పడి, అది పుండుగా మారింది. గత పది రోజులుగా ఆ పొక్కు ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది.

అయినప్పటికీ, చంద్రబాబు విశ్రాంతి లేకుండా పాలనా పనులను చక్కబెడుతున్నారు. నిత్యమూ సమీక్షలు, సమావేశాల్లో బిజీగా ఉంటూ ముందుగా ఖరారైన పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. దసరా నాడు కుటుంబ సభ్యులతో కలసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆయన, కంటి నొప్పిని భరిస్తూనే నిన్న అనంతపురం పర్యటనకు వెళ్లి, కియా పరిశ్రమ యాజమాన్యంతో సమీక్ష జరిపి, ఆపై వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ దంపతులను ఆశీర్వదించి వచ్చారు.
chandrababu
eye

More Telugu News