సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అబ్బాయిలు వెంట పడడంపై కాజల్
  • రెండు చిత్రాలు నిర్మిస్తున్న సీనియర్ నిర్మాత 
  • 'నేను కిడ్నాప్ అయ్యాను' సెన్సార్ పూర్తి
*  చిన్నప్పుడు తన వెంట అబ్బాయిలు బాగా పడేవారని అంటోంది అందాలతార కాజల్ అగర్వాల్. "చదువుకునే రోజుల్లో అబ్బాయిలు నా వెంటపడేవారు అయితే, దానిని పెద్దగా సీరియస్ గా తీసుకునే వాళ్లం కాదు. ఆ వయసులో అంతా ఇంతేలే అని నవ్వుకునే వాళ్లం. అందుకే, వాళ్లని తిట్టడం కాని, ఇంట్లో కంప్లైంట్ చేయడం కాని చేసే వాళ్లం కాదు" అని చెప్పింది.      
*  'మిస్టర్ పెళ్లాం', 'శ్రీకారం' వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత గవర పార్థసారథి చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి అడవి శేష్ హీరోగా అడవి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతోంది. దీని తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. మరొక చిత్రం 'ఘాజి' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతుంది. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.    
*  శ్రీకర్ బాబు దర్శకత్వంలో బ్రహ్మానందం, పోసాని కీలక పాత్రలు పోషించిన 'నేను కిడ్నాప్ అయ్యాను' చిత్రం సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
Kajal
brahmanandam

More Telugu News