సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • ప్రయోగాలకు సిద్ధమంటున్న రాశిఖన్నా 
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'ఖాకి'
  • సాయి ధరమ్ 'జవాన్' షూటింగ్ పూర్తి
*  ఆర్టిస్టుగా ఎలాంటి ప్రయోగం చేయడానికైనా తాను సిద్ధమేనని అంటోంది కథానాయిక రాశిఖన్నా. "హీరోయిన్లకు కూడా ఇప్పుడు మంచి పాత్రలు పోషించే అవకాశాలు వస్తున్నాయి. అందుకే, నేను కూడా విభిన్న తరహా పాత్రలు చేయాలనుకుంటున్నాను. పాత్ర పరంగా ఎలాంటి ప్రయోగం చేయడానికైనా నేను రెడీ" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.    
*  కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఖాకి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని నవంబర్ 17న రిలీజ్ చేయడానికి నిర్మాతలు డేట్ ఫిక్స్ చేశారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'జవాన్' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. దేశం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడే యువకుడిగా సాయిధరమ్ నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
Rashi
karthi
sai

More Telugu News