ప్రేమనాటకం ఆడిన ప్రియుడిపై ప్రియురాలి ఘాతుకం!
Add ap7am to your home Screen

ప్రేమనాటకం ఆడిన ప్రియుడిపై ప్రియురాలి ఘాతుకం!

  • కేరళలోని కుట్టిపురంలో దారుణం
  • ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వేరే యువతిని వివాహం చేసుకునేందుకు ప్రియుడి ప్రణాళికలు
  • ప్రియుడితో కలిసి లాడ్జ్ లో దిగిన యువతి
  • కాసేపటికే ప్రియుడి మర్మాంగం కోసేసిన వైనం 
  • గిలగిల్లాడుతూ కేకలు వేసిన ప్రియుడు
  •  ఆసుపత్రిలో చేర్చి, పోలీసులకు ఫిర్యాదు చేసిన లాడ్జ్ సిబ్బంది
కేరళలోని కుట్టిపురంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుట్టిపురానికి చెందిన యువతి, యువకుడు (26) ప్రేమించుకున్నారు. ఈ నేపధ్యంలో యువకుడు వేరే యువతిని వివాహం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. దీనిని తెలుసుకున్న ప్రియురాలు 'నీతో మాట్లాడాలి, రా' అంటూ తీసుకువెళ్లింది. కుట్టిపురంలో ఒక లాడ్జ్ లో వీరిద్దరూ దిగారు. లాడ్జ్ లో దిగిన కాసేపటికే వారిద్దరూ దిగిన రూం నుంచి గట్టిగా అరుపులు రావడంతో లాడ్జ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఇంతలో తీవ్ర రక్తస్రావంతో గిలగిలలాడుతూ యువకుడు రూం బయటపడి ఉండడంతో అతనిని ఆసుపత్రికి తరలించిన లాడ్జ్ సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడడంతో అతని మర్మాంగం కోసేశానని సదరు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువతిని రిమాండ్ కు తరలించారు. 
kerala
kuttipuram
lovers
lover attack

More Telugu News