టైటిల్ 'తొలి ప్రేమ' అయినా పవన్ మూవీతో పోలిక ఉండదట!
ఈ సినిమాకి 'తొలిప్రేమ' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఇది పవన్ 'తొలిప్రేమ'కి రీమేక్ అయ్యుంటుందని కొంతమంది .. సీక్వెల్ అయ్యుంటుందని మరికొంతమంది అనుకున్నారు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. టైటిల్ 'తొలిప్రేమ' అయినప్పటికీ, పవన్ సినిమాకి .. వరుణ్ తేజ్ మూవీకి ఎలాంటి పోలిక ఉండదని చెబుతున్నారు. వరుణ్ తేజ్ జోడీగా రాశి ఖన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.