allu arjun: ప్రభాస్ తరువాత ప్లేస్ లో నిలిచిన బన్నీ!

షార్ట్స్‌లో చూడండి
'దువ్వాడ జగన్నాథమ్' మూవీ 'సరైనోడు'ను మించిన వసూళ్లు సాధించకపోయినా, అల్లు అర్జున్ కి ఓ కొత్త రికార్డు తెచ్చి పెట్టింది. ప్రభాస్ తరువాత స్థానంలో బన్నీని నిలబెట్టింది. తెలుగులో ఇంతవరకూ 70 కోట్ల షేర్ ను సాధించిన రెండు సినిమాలు కలిగిన హీరోగా ప్రభాస్ మాత్రమే వున్నాడు. 'బాహుబలి' .. 'బాహుబలి 2' ఆయనకి ఈ స్థానాన్ని తెచ్చిపెట్టాయి.

 'సరైనోడు' 76 కోట్ల షేర్ ను .. 'దువ్వాడ జగన్నాథమ్' 71 కోట్లపైగా షేర్ ను వసూలు చేసింది. దాంతో ప్రభాస్ తరువాత ఈ జాబితాలోకి అల్లు అర్జున్ వచ్చి చేరాడు. ఇక 70 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమాల జాబితాలో, ఒక సినిమా మాత్రమే వున్న హీరోల్లో చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. చరణ్ వున్నారు.    
Go Back to Shorts
allu arjun

More Telugu News