హర్మూజ్‌పై అమెరికా జెండా.. ట్రంప్ సంచలన ప్రకటన
- హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తానన్న ట్రంప్
- ఇరాన్‌పై విజయం తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
- ఇరాన్ 159 నౌకలు ధ్వంసమయ్యాయని ట్రంప్ వ్యాఖ్య
- 212 ఇరాన్ విమానాలు కూల్చివేశామని ప్రకటన
- ఇరాన్ నాయకత్వం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని అన్నారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జలమార్గంపై అమెరికా హక్కు ప్రకటిస్తానని చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ఎలా ప్రకటిస్తారన్న దానిపై ట్రంప్ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీనికి చట్టపరమైన ఆధారం ఏంటన్నదీ ఆయన స్పష్టం చేయలేదు.
న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ తెలిపారు. తమ సైనిక చర్యలు ఎంత విజయవంతమయ్యాయో బయటకు పూర్తిగా చెప్పడం లేదని, అయితే ఇరాన్‌కు మాత్రం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసని అన్నారు.
ఇరాన్‌కు చెందిన మొత్తం 159 నౌకలు సముద్రంలో మునిగిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన 212 విమానాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇరాన్ వద్ద ఉన్న విమానాల్లో కొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేసినవేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ నాయకత్వం కూడా తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ అన్నారు. ఆ దేశంలోని కీలక నాయకులు వరుసగా మృతి చెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చలు జరిపేందుకు సరైన నాయకత్వం లేకపోవడం తనకు సమస్యగా మారిందని చెప్పారు. ఇరాన్ వద్ద ఇంకా కొన్ని క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. అయితే వాటిని తయారు చేసే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు కారణాన్ని కూడా ట్రంప్ వివరించారు. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. అమెరికా సైనిక శక్తిని అవసరానికి మించి ఉపయోగించాల్సి వచ్చిందని అంగీకరించారు. అయినా ఇరాన్ అణ్వస్త్రం పొందకుండా అడ్డుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.