'నా పేరు సూర్య' కోసం బన్నీ చాలా కేర్ తీసుకుంటున్నాడట!
ఇంతవరకూ వక్కంతం వంశీ కథలను మాత్రమే అందిస్తూ వచ్చాడు. వంశీ కథ చెప్పే తీరు చాలా బాగుంటుందని అంటారు. అలా చెప్పిన కథను ఆయన తెరపై ఆవిష్కరించే తీరు విషయంలోను బన్నీ ప్రత్యేక దృష్టి పెట్టాడట. దర్శకుడిగా ఇది ఆయనకి మొదటి సినిమా కనుక, తాను ఎక్కువ చొరవ చూపిస్తున్నట్టు సమాచారం. కథ .. కథనం .. మాటలు .. పాటలు ఇలా ప్రతి ఒక్క విషయంలో తన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సహజంగానే బన్నీ తన ప్రతి సినిమా విషయంలోను చాలా కేర్ తీసుకుంటాడు. అది ఈ సినిమా విషయంలో మరి కాస్త ఎక్కువగా ఉందన్న మాట.