varun tej: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన సాయిపల్లవి కిందపడిపోయిందట!

షార్ట్స్‌లో చూడండి
'ఫిదా' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సాయిపల్లవి నటనకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆమెకు దక్కుతోన్న పేరు చూసి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం ఆమె ట్రాక్టర్ నడపడం నేర్చుకుని .. పొలాల్లో ట్రాక్టర్ నడిపే సన్నివేశాల్లో చాలా బాగా చేసిందని అన్నారు.

 ఇక ముందుగా రాసుకున్న క్లైమాక్స్ సీన్ ప్రకారం సాయిపల్లవి పరిగెడుతూ ట్రైన్ ఎక్కాలి. అలా పరిగెడుతూ ట్రైన్ ఎక్కబోయిన ఆమె .. కిందపడిపోయింది. మోకాళ్లు .. మోచేతులు బాగా కొట్టుకుపోయాయి. అయినా ఆమె తనకైన గాయాలను పెద్దగా పట్టించుకోకపోవడం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సినిమా కోసం సాయిపల్లవి ఇలాంటి కష్టాలు ఎన్నో పడింది. అందుకే ఈ సినిమాకి ఈ స్థాయి విజయం .. ఆమెకి పేరు ప్రతిష్ఠలు దక్కాయని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
varun tej
sai pallavi

More Telugu News