ఇలియానా ఖాతాలో ఇంకో హిట్ పడిపోయింది!
తొలి రోజున ఈ సినిమా వసూళ్లు 5 కోట్లు దాటాయి అంతే. ఆ తరువాత సినిమాపై మంచి టాక్ రావడంతో రెండో రోజు 7.5 కోట్లు .. మూడో రోజు 10 కోట్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ పోతుండటం విశేషం. అనీష్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ఇలియానాకి ఇంకో హిట్ దొరికేసింది. ఈ సక్సెస్ తనకి బాలీవుడ్లో మరిన్ని ఛాన్సులు దక్కడానికి ఉపయోగపడుతుందని ఇలియానా భావిస్తోంది. అనిల్ కపూర్ .. అర్జున్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాతో, ఇలియానా నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.