అందాల రకుల్ అలా రిక్షా తొక్కేసిందండోయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందాల రకుల్ అలా రిక్షా తొక్కేసిందండోయ్!

రిక్షా తొక్కడమనేది .. రిక్షా ఎక్కినంత తేలిక కాదు. అలవాటు లేకపోతే అది ఒక వైపుకు లాగేస్తూ ఉంటుంది. అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. అలాంటిది కొత్తే అయినా .. మొదటిసారే అయినా రకుల్ అవలీలగా రిక్షా తొక్కేసింది .. అదీ ఒక పాట కోసం. తమిళంలో కార్తీ కథానాయకుడిగా 'ధీరన్ అధిగారం ఒండ్రు' అనే సినిమా తెరకెక్కింది.

 ఈ సినిమాలోని ఒక పాటలో రకుల్ రిక్షా తొక్కవలసి వుంది. ఆమె భయపడితే కొరియోగ్రఫీని మరోలా మార్చుకుందామని డాన్స్ మాస్టర్ అనుకున్నాడట. కానీ ట్రై చేస్తానంటూ రిక్షా తీసుకున్న రకుల్ .. చాలా ఈజీగా రిక్షా తొక్కేసి అక్కడున్న వాళ్లందరినీ ఆశ్చర్య పరిచిందట. ఈ షాట్ కూడా బాగా వచ్చిందని చెబుతున్నారు. రిక్షాను ఎక్కడ కింద పడేస్తానోనని రిక్షా అతను కంగారు పడ్డాడు గానీ .. తాను మాత్రం అస్సలు టెన్షన్ పడలేదని రకుల్ చెప్పడం విశేషం. తెలుగులో ఈ సినిమా 'ఖాకి' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.    
karthi
rakul

More Telugu News