varun tej: లాభాల బాటలో పరుగులు తీస్తోన్న 'ఫిదా'

షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ప్లానింగ్ అంటే దిల్ రాజుదే అనే మాట వినిపిస్తోంది. రీసెంట్ గా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన 'ఫిదా' .. లాభాల బాటలో పరుగులు తీస్తూ ఉండటమే అందుకు కారణం. వరుణ్ తేజ్ .. సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

దాదాపు 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, తొలి వారాంతంలోనే 14 కోట్ల షేర్ ను .. 25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 35 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిన ఈ సినిమా, 2 మిలియన్ మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ సినిమా కథా కథనాల పరంగా ప్రేక్షకులను .. లాభాల పరంగా బయ్యర్లను 'ఫిదా' చేసిందని చెప్పుకుంటున్నారు.     
Go Back to Shorts
varun tej
sai pallavi

More Telugu News