'విఐపి 2' కోసం12 కోట్లు అడుగుతున్న ధనుష్!

ధనుష్ గతంలో చేసిన 'విఐపి' సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఆయన ఆ సినిమాకి సీక్వెల్ గా 'విఐపి 2' సినిమా చేశాడు. ఈ సినిమాను తమిళ .. తెలుగు భాషల్లో ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో 'విఐపి' .. తెలుగులో 'రఘువరన్ బీటెక్' పేరుతో వచ్చి భారీ వసూళ్లను సాధించింది.

అయినా దాని సీక్వెల్ రైట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతోన్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని సమాచారం. తెలుగు వెర్షన్ హక్కుల రేటు 12 కోట్లు చెబుతున్నారట. ఆ స్థాయి రేటు పెట్టడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. ఈ మధ్య కాలంలో అనువాద సినిమాలకి పెద్దగా డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు.    
Go Back to Shorts
dhanush
amala paul

More Telugu News