షూటింగ్ పూర్తిచేసుకున్న రకుల్, కార్తీల 'ఖాకి'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్ పూర్తిచేసుకున్న రకుల్, కార్తీల 'ఖాకి'!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఛాన్స్ కోసం కథానాయకులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పాత్ర వస్తే చాలు తమదైన స్టైల్లో చెలరేగిపోతుంటారు. అలాంటి పాత్రనే కార్తీకి 'ఖాకి' సినిమాలో లభించింది. వినోద్ దర్శకత్వంలో 'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు' అనే సినిమాలో కార్తీ నటించాడు. ఈ సినిమాకే తెలుగులో 'ఖాకి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కార్తీ జోడీగా తొలిసారిగా ఈ సినిమాలో రకుల్ నటించింది. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 2005లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టులో గానీ .. సెప్టెంబర్ లో గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందనే నమ్మకంతో కార్తీ వున్నాడు. 
Karthi
Rakul

More Telugu News