'ఉత్త‌రాది వారి పెత్త‌నం' అంటూ విభేదాలు తెచ్చే వారిని న‌మ్మ‌కూడదు!: పవన్ కల్యాణ్ పై వెంకయ్య విసుర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఉత్త‌రాది వారి పెత్త‌నం' అంటూ విభేదాలు తెచ్చే వారిని న‌మ్మ‌కూడదు!: పవన్ కల్యాణ్ పై వెంకయ్య విసుర్లు

ప్రత్యేక హోదా, జల్లికట్టు పోరాటాల‌పై స్పందిస్తూ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ ప‌ట్ల కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య నాయుడు ఈ రోజు మ‌రోసారి స్పందించారు. పార్ల‌మెంటులో రాష్ట్ర విభ‌జ‌న బిల్లు పెట్టిన‌ప్పుడు నోరు విప్ప‌ని నాయ‌కులు ఈ రోజు హోదా గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఆందోళ‌న‌లు తెల‌ప‌డం సిగ్గుచేట‌ని తెలిపారు. ద‌క్షిణాదివారిపై ఉత్త‌రాది వారి పెత్త‌నం అంటూ వ్యాఖ్య‌లు చేస్తూ విభేదాలు తెచ్చే వారిని న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌న ప‌వ‌న్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు.  
special status
pawan kalyan
venkaiah

More Telugu News